కారు బీభత్సం ఢీకొనడంతో ఎయిర్ వాల్వ్ ధ్వంసం.. భారీగా వృథా అవుతున్న నీరు
నాగోల్‌లో కృష్ణా వాటర్ పైప్‌లైన్ ధ్వంసం.. పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
కారు బీభత్సం ఢీకొనడంతో ఎయిర్ వాల్వ్ ధ్వంసం.. భారీగా వృథా అవుతున్న నీరు
అత్యవసర మరమ్మతులు చేపట్టిన జలమండలి అధికారులు
హైదరాబాద్: నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద కృష్ణా వాటర్ పైప్‌లైన్ దెబ్బతింది. ఓ కారు ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టడంతో పైప్‌లైన్ నుంచి నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథా అవుతోంది.
సమాచారం అందుకున్న జలమండలి అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అత్యవసర మరమ్మతు పనులు చేపట్టారు. పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్, వనస్థలిపురం, రామంతపూర్, బీరప్పగడ్డ, ఆటోనగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, పద్మారావునగర్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, సికింద్రాబాద్, కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్, మారేడ్‌పల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నీటి సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని అందుబాటులో ఉంచాలని జలమండలి ఉన్నతాధికారులు సూచించారు. ప్రజలు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Post a Comment