సర్దార్ అమ్జద్ షరీఫ్ సాహెబ్‌ను పరామర్శించిన ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
5 వేల ఎకరాల భూస్వామి సర్దార్ అమ్జద్ షరీఫ్ సాహెబ్‌ను పరామర్శించిన ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
ఇల్లందు, అక్టోబర్ 19:–బూర్గంపహాడ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ భూస్వామి, సుమారు 5 వేల ఎకరాల భూమికి యజమాని అయిన జనాబ్ సర్దార్ అమ్జద్ షరీఫ్ సాహెబ్‌ను ఆయన పెద్ద మేనల్లుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పరామర్శించారు. ఈ సందర్భంగా తన పెద్ద మామయ్యతో ఆప్యాయంగా మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడిగా, TEMRIES కౌన్సిలర్‌గా, HMS జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనతో కొంత సమయం గడిపారు.
ఫొటో క్యాప్షన్: బంజార్దార్–బూర్గంపహాడ్ ప్రాంతానికి చెందిన జనాబ్ సర్దార్ అమ్జద్ షరీఫ్ సాహెబ్‌ను పరామర్శిస్తున్న ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ.

Post a Comment