-->

కోదాడలో విషాదం.. తల్లి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

 

కోదాడలో విషాదం.. తల్లి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

కోదాడలో విషాదం.. తల్లి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలిక జాస్మిన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాలిక ఆడుకుంటున్న సమయంలో తల్లి సైరాబాను రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి మృతి చెందింది.

సైరాబానుకు మానసిక సమస్యలు ఉన్నట్లు బంధువులు వెల్లడించినట్లు సమాచారం. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె తన కుమార్తెతో కలిసి బంధువుల ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

Blogger ఆధారితం.