సింగరేణి కొత్తగూడెం ఏరియాలో హెచ్ఎంఎస్ యూనియన్ ఫ్లెక్సీ చోరీ
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో హెచ్ఎంఎస్ యూనియన్ ఫ్లెక్సీ చోరీ
గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీని తొలగించి తీసుకెళ్లారని యూనియన్ ఆరోపణ.. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్
కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియాలో హెచ్ఎంఎస్ (HMS) యూనియన్‌కు సంబంధించిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తీసుకెళ్లిన ఘటనను హెచ్ఎంఎస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మాడిపల్లి కరుణాకర్ తీవ్రంగా ఖండించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న యూనియన్‌పై ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వారు పేర్కొన్నారు.
యూనియన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి సుమారు 12 గంటల తర్వాత కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఫిల్టర్ బెడ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ యూనియన్ ఫ్లెక్సీని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తీసుకెళ్లారు. ఈ ఘటనపై యూనియన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హెచ్ఎంఎస్ యూనియన్ చేస్తున్న పోరాటాన్ని, యూనియన్ ఎదుగుదలను సహించలేని కొంతమంది ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యులెవరనేది విచారణ ద్వారా తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన కార్మికుల హృదయాల నుంచి హెచ్ఎంఎస్ యూనియన్ను తొలగించలేరని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ యూనియన్ బలం ఫ్లెక్సీల్లో లేదని, కార్మికుల ఐక్యతలో ఉందని తెలిపారు. ఇలాంటి చర్యలతో యూనియన్ ఎదుగుదలను అడ్డుకోలేరని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, ఫ్లెక్సీని తొలగించి తీసుకెళ్లిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ యూనియన్ కొత్తగూడెం ఏరియా ప్రతినిధులు కోరారు.
హెచ్ఎంఎస్ యూనియన్ జిందాబాద్.. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి!

Post a Comment