తెలంగాణకు తుఫాను ముప్పు.. నవంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు!
తెలంగాణకు తుఫాను ముప్పు.. నవంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు!
హైదరాబాద్: బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అంచనాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 16–17 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, నవంబర్ 19న చెన్నై నుంచి బాపట్ల మధ్య, ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
తుఫాను ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 20, 21 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
హైదరాబాద్‌లోనూ వర్షాలు
నవంబర్ 21, 22 తేదీల్లో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను కదలికలు, తీవ్రత, తీరం దాటే ప్రాంతాన్ని బట్టి వర్షాల ప్రభావంలో మార్పులు ఉండవచ్చు.
ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని, అధికారిక వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించాలని సూచిస్తున్నారు.

Post a Comment