ఇందిరమ్మ చీరల పంపిణీ వాయిదా.. రేపు యథాతథంగా సీఎం సిద్దిపేట పర్యటన! రూ.5 లక్షల ఇందిరమ్మ
ఇందిరమ్మ చీరల పంపిణీ వాయిదా.. రేపు యథాతథంగా సీఎం సిద్దిపేట పర్యటన!
రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
కొత్త లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులు విడుదల రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగనుంది. రేపు జరిగే బహిరంగ సభలో రూ.5 లక్షల బీమా సౌకర్యంతో కూడిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు.
దీంతోపాటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగామ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చీరల పంపిణీ వాయిదా పడినప్పటికీ, ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Post a Comment