రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన గద్వాలలో విద్యుత్ శాఖ ఏఈ
రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన గద్వాలలో విద్యుత్ శాఖ ఏఈ..
రూ.12.62 లక్షల బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్.. కారు డ్యాష్‌బోర్డుపై డబ్బులు పెట్టించిన అధికారి**
గద్వాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి చిక్కాడు. రూ.60 వేల లంచం తీసుకుంటూ తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గద్వాల సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అన్నారపు రమేష్ బాబును మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నవంబర్ 26న ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదుదారుడు, మరో కాంట్రాక్టర్ కలిసి చేపట్టిన పనులకు సంబంధించి రూ.12,62,070 బిల్లు మంజూరు చేసి ప్రాసెస్ చేయడానికి ఏఈ రమేష్ బాబు రూ.60 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో తన కారులోని డ్యాష్‌బోర్డుపై లంచం డబ్బులు పెట్టాలని ఫిర్యాదుదారుడికి అధికారి సూచించారు. దీంతో ఆయన సూచించినట్లుగానే ఫిర్యాదుదారుడు రూ.60 వేల నగదును కారు డ్యాష్‌బోర్డుపై ఉంచారు.
అప్పటికే పథకం ప్రకారం అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారి వినియోగిస్తున్న AP07CZ4705 నంబర్ గల కారులోని డ్యాష్‌బోర్డుపై రసాయన పరీక్షలు నిర్వహించగా అవి సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. అధికారి సూచన మేరకే లంచం నగదు అక్కడ ఉంచినట్లు ఏసీబీ నిర్ధారించింది.
ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలోని మొదటి అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు.
**లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి**
ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ **1064**కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) ఖాతా @TelanganaACB ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Post a Comment