మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం.. అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం!
మెదక్ జిల్లాలో రైతులకు తీరని నష్టం.. అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం!
మెదక్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం.. నీటిపాలైన ధాన్యం!
**రామాయంపేట:** మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు సిద్ధం చేసుకున్న రైతులకు ప్రకృతి కన్నెర్ర చేయడంతో కన్నీళ్లే మిగిలాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి బండపై ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది.
కోనాపూర్ బండపై ధాన్యాన్ని ఆరబోసిన సుమారు 20 మంది రైతులు ఈ వర్షంతో తీవ్రంగా నష్టపోయారు. వర్షపు నీటికి ధాన్యం కొట్టుకుపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఓవైపు సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతుల కష్టాన్ని నీటిపాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment