బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లిన రాకెట్.. షాప్ పూర్తిగా దహనం!

 

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లిన రాకెట్.. షాప్ పూర్తిగా దహనం!

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లిన రాకెట్.. షాప్ పూర్తిగా దహనం!

హైదరాబాద్, చిలకలగూడ: దీపావళి పండుగ వేళ సికింద్రాబాద్ పరిధిలోని నామలగుండులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు దీపావళి సంబరాల్లో భాగంగా కాల్చిన రాకెట్ అదుపుతప్పి నేరుగా సమీపంలోని బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రాకెట్ నుంచి వెలువడిన నిప్పురవ్వలు దుకాణంలో నిల్వ ఉంచిన బాణసంచాకు అంటుకోవడంతో పటాకులు వరుసగా భారీ శబ్దాలతో పేలడం ప్రారంభించాయి. క్షణాల్లోనే మంటలు దుకాణం మొత్తం వ్యాపించి షాప్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి. పటాకుల పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. పేలుళ్ల శబ్దాలు, అగ్నికీలలను చూసి స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణం పూర్తిగా కాలిపోయి బూడిదైనట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. దీపావళి వేడుకల్లో నిర్లక్ష్యంగా రాకెట్లు కాల్చడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దుకాణాలు మరియు జనసంచారం ఉన్న ప్రాంతాలకు దూరంగా బాణసంచా కాల్చాలని సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.