మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు సెటైర్.. ‘ఇటీవల విన్న అతిపెద్ద జోక్ ఇదే!
మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు సెటైర్.. ‘ఇటీవల విన్న అతిపెద్ద జోక్ ఇదే!’
హైదరాబాద్: నగరంలో తాగునీటి ఎద్దడే లేదంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నగరంలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, నీటి కొరతే లేదని మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఈ మేరకు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన కేటీఆర్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “ఇటీవల కాలంలో నేను విన్న అతిపెద్ద జోక్ ఇదే! కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటే ఇలాంటి సర్కస్ చూడాల్సిందే!” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
నగరంలో నీటి సరఫరా వ్యవస్థ గాడి తప్పిందని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ ఆయన సెటైర్పై రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.

Post a Comment