తెల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టైర్ల నిల్వ కేంద్రంలో చెలరేగిన మంటలు!
తెల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టైర్ల నిల్వ కేంద్రంలో చెలరేగిన మంటలు!
రామచంద్రాపురం: మండల పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-1 సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్లాస్టింగ్ పనులకు ఉపయోగించే పాత టైర్లను నిల్వ ఉంచిన ఓ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన టైర్ల నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న హైడ్రా, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొల్లూరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మకునంద్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలు అధికారుల పరిశీలన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment