అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకలు డీ ఒకరు మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు!

 

అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకలు డీ ఒకరు మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు!

అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకలు డీ ఒకరు మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు!

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని అనుబోస్ కాలేజ్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు

వివరాల్లోకి వెళితే.. పాల్వంచ నుంచి దేవుజా తండా వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం, కిన్నెరసాని వైపు నుంచి పాల్వంచకు వస్తున్న మరో ద్విచక్ర వాహనం అనుబోస్ కాలేజ్ సమీపంలో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయ

ఈ ప్రమాదంలో ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అత్త, అల్లుళ్లలో అల్లుడు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అతనితో పాటు ప్రయాణిస్తున్న అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడటంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రికి తరలించిన స్థానికులు

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

అనుబోస్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.