రాములవారిని దర్శించుకున్న చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఖమ్మం కార్పొరేటర్ వైష్ణవి
రాములవారిని దర్శించుకున్న చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఖమ్మం కార్పొరేటర్ వైష్ణవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకున్న కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఖమ్మం కార్పొరేటర్ వైష్ణవి. ఈ సందర్భంగా వారిని ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో వారికి ప్రత్యేక దర్శనం చేపించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సీతారామ చంద్ర స్వామి ఆలయం భద్రాచలం లొ కొలువై ఉన్నదని ఆ రామ చంద్ర స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని సీతారామ చంద్రల కరుణాకటాక్షాలు, ఖమ్మం కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సీత రామచంద్ర స్వాములను కోరుకున్నామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఖమ్మం కార్పొరేటర్ వైష్ణవి ఖమ్మం బిఆర్ఎస్ నాయకులు ప్రసన్న కృష్ణ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment