ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
*ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి?*
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎల్లుండి శాసన సభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నట్టు తెలుస్తుంది.
సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.
స్పీకర్ పదవికి మరో సీని యర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 22, 23 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది...

Post a Comment