-->

ఫుల్ గా మద్యం త్రాగి పాఠశాలలో పడిపోయిన ఉపాద్యాయుడు

ఫుల్ గా మద్యం త్రాగి పాఠశాలలో పడిపోయిన ఉపాద్యాయుడు

ఫుల్ గా మద్యం త్రాగి పాఠశాలలో పడిపోయిన ఉపాద్యాయుడు

*ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.* విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే. వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు.

అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. పూర్తిగా నిషాలో ఉన్న అతడు.. కనీసం నాలుగు అడుగులు నడిచి పాఠశాలలోకి వెళ్లేంత శక్తిలేని స్థితిలో ఉన్నాడు. పిల్లలందరూ చూస్తుండగానే స్వయంగా వారి ఎదుటే తూళుతూ నడిచాడు. ఒక్క అడుగు కూడా సక్రమంగా వేయలేక బడి బయటే కుప్పకూలి మత్తులోకి జారుకున్నాడు.

విద్యార్థులతోపాటు గ్రామస్తులు కూడా నిశ్చేష్టులై చూసిన ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌నగర్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లుగా ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య.. తరచూ మద్యం తాగి విధులకు హాజరవుతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా పూల్ గా మద్యం తాగి నడవలేని స్థితిలో పాఠశాల వద్దకు వచ్చాడు.

పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడు.. నడిచే శక్తి లేని స్థితిలో ఉండి పాఠశాల బయటే పడిపోయాడు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు కొద్దిసేపటి తరువాత వచ్చారు. స్పృహలో లేని అతడిని పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి చాప మీద పడుకోబెట్టారు. కాగా, రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఇతడు తరచూ ఇలాగే మద్యం తాగి విధులకు హాజరవుతున్నట్లు స్థానికులు చెప్పారు. 

గతంలో అనేకసార్లు తాము ఇతడి విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వారు అతడిని మందలించినప్పటికీ అతడిలో మార్పు రావడం లేదని, గౌరవప్రదమైన వృత్తికి మచ్చ తెస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793