-->

జబర్దస్త్ సహా నటుడు ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి

 

జబర్దస్త్ సహా నటుడు ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి

*జబర్దస్త్ సహా నటుడు ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి* 

ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున కొత్తగూడెంలో జరిగింది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్, సైడ్ యాక్టర్ మేదర మహమ్మదీన్ షూటింగ్ నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరాడు.

ఈ క్రమంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్న సమయంలో జారిపడి ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్య ఇరుక్కున్నాడు. గమనించిన రైల్వే సిబ్బంది, ప్రయాణికులు మహమ్మద్దీన్ ను బయటికి తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరణించాడు. కొత్తగూడెంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నివాసి మేదర మహమ్మదీన్ కి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Blogger ఆధారితం.