వ్యక్తి ఆత్మహత్య పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
వ్యక్తి ఆత్మహత్య పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంటలో సక్రియ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు సక్రియకు గ్రామంలోని మరో వర్గంతో భూ వివాదం ఉన్నట్లు తెలిసింది.
ఇదే విషయంపై ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొణిజర్ల పోలీస్ స్టేషన్ ఎదుట సక్రియ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment