బోగత జలపాతంలో స్నానానికి దిగి యువకుడు మృతి
బోగత జలపాతంలో స్నానానికి దిగి యువకుడు మృతి
ములుగు జిల్లా: స్నేహితులతో కలిసి జలపాతం లోకి దిగిన యువకుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది..
వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేంద్ర, సుశాంత్ వంశీ గౌస్ కలిసి చీకుపల్లి బొగతను సందర్శించడానికి వచ్చారు.
బొగత అందాలను తిలకించిన స్నేహితులు బొగతలో స్నానం చేసేందుకు దిగారు.. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంతయ్యాడు
ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా… యువ కుడి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపో వడంతో స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు...

Post a Comment