-->

నార్సింగ్ ఆనంద్‌పై నారాయణఖేడ్ డీఎస్పీకి ఎంఐఎం అధ్యక్షులు ముహీద్ పటేల్ ఫిర్యాదు

నార్సింగ్ ఆనంద్‌పై నారాయణఖేడ్ డీఎస్పీకి ఎంఐఎం అధ్యక్షులు ముహీద్ పటేల్ ఫిర్యాదు

నార్సింగ్ ఆనంద్‌పై నారాయణఖేడ్ డీఎస్పీకి ఎంఐఎం అధ్యక్షులు ముహీద్ పటేల్ ఫిర్యాదు

నారాయణఖేడ్: మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌కు చెందిన యతి నార్సింగ్ ఆనంద్‌పై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది ముహీద్ పటేల్, సోమవారం మైనారిటీ ఎంఐఎం నాయకులతో కలిసి నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. యతి నార్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

విలేకరులతో మాట్లాడుతూ, ముహీద్ పటేల్, "మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న నార్సింగ్ ఆనంద్‌కు ఉన్న బెయిల్ వెంటనే రద్దు చేయాలి" అని అన్నారు. "మన దేశం అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి ఉండే భారతదేశం. యతి నార్సింగ్ ఆనంద్ వంటి వ్యక్తులు చిచ్చు పెట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రధానమంత్రి మోదీ ఖండించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ సర్పంచ్ నజీబ్, ఎంఐఎం నాయకులు మజహర్, జబర్, ముక్తార్, అంజెద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793