-->

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్ల నియామకం.. జూన్ 11 వరకు దరఖాస్తులకు అవకాశం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్ల నియామకం.. జూన్ 11 వరకు దరఖాస్తులకు అవకాశం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్ల నియామకం.. జూన్ 11 వరకు దరఖాస్తులకు అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5: ప్రజలకు న్యాయపరమైన అవగాహన కల్పించడంతో పాటు న్యాయ సేవలను అందించేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికుల నుంచి పారా లీగల్ వాలంటీర్ల (PLVs) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత, కార్యదర్శి ఎం. రాజేందర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సమాజ సేవా దృక్పథంతో ప్రజలకు న్యాయ సహాయం అందించాలనే ఆసక్తి ఉన్న వారు జూన్ 11, 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేయడానికి ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్యులు, న్యాయ విద్యార్థులు, సేవా దృక్పథం కలిగిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మైత్రి సంఘం సభ్యులు, డ్వాక్రా మహిళలు తదితరులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, గుర్తింపు కార్డు ప్రతులు, రెండు స్టాంప్ సైజు ఫోటోలు మరియు సంబంధిత ధ్రువపత్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోక్సో కోర్టు కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

పారా లీగల్ వాలంటీర్లకు కనీస విద్యార్హతగా పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, అందులో నుంచి 50 మంది పారా లీగల్ వాలంటీర్లను నియమిస్తామని అధికారులు తెలిపారు.

ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకమని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793