గోదావరి ఖని చౌరస్తా నిరసన దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
గోదావరి ఖని చౌరస్తా నందు నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
సింగరేణి 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంస్థ సాధించిన రూ.4,701 కోట్ల నికర లాభాల నుంచి సంస్థ విస్తరణ పెట్టుబడులకు రూ.2.289 కోట్లు కేటాయించి మిగిలిన రూ.2,412 కోట్ల నుంచి 33 శాతం రూ.796 కోట్లను కార్మికులకు బోనస్ గా ప్రకటించిన విధానాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోదావరి ఖని చౌరస్తా నందు నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి టి బి జి కె యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కొత్తగూడెం, ఇల్లందు ,మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ లు పాల్గొని ప్రసంగించారు...
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సింగరేణి సంస్థకు గణనీయమైన లాభాలు తెచ్చి పెట్టిన కార్మికులను కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు.. చేతిలో పాలన ఉందికదా అని ఇష్టానుసారంగా చేస్తూ కార్మికులను నష్టపరచడం సరికాదని తెలిపారు.. కార్మిక ఓట్లతో గెలిచిన కార్మిక సంఘాలు వారి వారి పైరవీల కోసం కాంగ్రెస్ పాలనకు వంతపడుతూ వంత పాడుతూ కార్మికులను మోసం చేశాయని వారు ఆరోపించారు..
దసరా పండుగను పురస్కరించుకొని ఇస్తున్న అరకొర లాభాల వాటా ను సహించబోమని మొత్తం నికర లాభాల్లో వాస్తవిక లాభాలను కార్మికులకు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ను వదిలి పెట్టేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కు మద్దతుగా నిలిచే గెలిచిన కార్మిక సంఘాలకు కార్మిక క్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు..
పెద్ద ఎత్తునజరిగిన ఈ కార్యక్రమానికి బి ఆర్ యస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఏం ఎల్ ఏ లు కోరుకంటి చందర్, బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పుట్ట మధుకర్, mla కోవా లక్ష్మి, టి బి జి కె ఏస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పాల్గొని సింగరేణి కార్మిక వర్గానికి అండగా నిలుస్తామని తెలిపారు..
కొత్తగూడెం రీజియన్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాసరావు, జాఫర్, మణుగూరు ఏరియా నుంచి నాగెల్లి పాల్గొన్నారు

Post a Comment