నూలు డిపో మంజూరు పట్ల కాంగ్రెస్ హర్షం
*నూలు డిపో మంజూరు పట్ల కాంగ్రెస్ హర్షం*
*వేములవాడలో సీఎం, మంత్రి పొన్నం,విప్ ఆది చిత్రపటాలకు పాలాభిషేకాలు..*
*ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలిపిన పార్టీ శ్రేణులు*
వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేసి.. రూ .50 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందుకు కృషి చేసిన మంత్రులు బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆదివారం కృతజ్ఞతలు తెలిపి.. రాజన్న ఆలయం ముందు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లు మాట్లాడుతూ..
యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం వ్యక్తం అవుతుందని తెలిపారు.
దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరిందని..ఇక వారి కష్టాలు తీరనున్నాయని వారన్నారు.
వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని సుమారు 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనున్నదని, చెప్పారు.
యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా వారి ఉపాధి లభిస్తుందన్నారు.
మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు.
దసరా కానుకగా నూలు డిపోను మంజూరు చేసి.. రూ 50 కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇప్పప్పుల అజయ్ నాయకులు సంఘ స్వామి యాదవ్, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, గూడూరి మధు, తోట రాజు, ముప్పిడి శ్రీనివాస్, కోలకాని రాజు, నాగుల రాము గౌడ్, ముప్పిడి శ్రీధర్, నాగుల విష్ణు, దాడి మల్లేశం, పీర్ మహమ్మద్, పుల్కం రాజు, జడల శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, వస్తాది కృష్ణ, వలి, అంబాటి చందు, నాగుల మహేష్, బైరి సతీష్ (పండు) పోన్ చెట్టి శంకర్, వెంకన్న, సాయి తదితరులు ఉన్నారు.

Post a Comment