-->

హైదరాబాదులో TGERC - 8వ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సమావేశం

హైదరాబాదులో TGERC - 8వ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సమావేశం


హైదరాబాదులో TGERC - 8వ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సమావేశం

TGERC - 8వ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సమావేశం హైదరాబాదులో G. T. S కాలనీ కళ్యాణి నగర్ లో TGERC చైర్మన్ రంగారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో TRVKS సంఘ పక్షాన  కోడూరి ప్రకాశ్ పాల్గొని రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో సరఫరా, పంపిణీ మరియు విద్యుత్ సర్వీసులు పెరగటం వలన సంస్థ లలో పనిచేసే కార్మికులపై అధిక భారం పడుతుందని.

 దీనివలన రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కసారి సరఫరాలో  తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందున వెనువెంటనే నాలుగు కంపెనీలలో  O& M కార్మికుల రిక్రూట్మెంట్ చేయాలని, రాష్ట్ర అవసరాల కోసం బహిరంగ మార్కెట్లో TG TRANSCO వారు అధిక రేటు చెల్లించి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారని కానీ ERC నిర్ణయించిన ధరలు మాత్రమే టీజీ ట్రాన్స్కో కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నదని దీనివలన విద్యుత్ సంస్థలకు  భారీ నష్టాలు వస్తున్నాయని కావున ఇట్టి విషయాన్నీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెయచేసి TG TRANSCO  బహిరంగ మార్కెట్లో కొంటున్న అధిక ధరల విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించి విద్యుత్ సంస్థలు నష్టాల బారిన పడకుండా కాపాడాలని కోరినారు.

 ఈ సమావేశం లో TRVKS TRANSCO కార్యదర్శి P రాములు సీనియర్ జర్నలిస్ట్ లు  నరసింహ రెడ్డి, వేణుగోపాలరావు, పారిశ్రామిక వేత్తలు వివిధ రంగాల ప్రముఖులు మరియు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793