జర్నలిస్టులపై మీకెందుకంత కక్ష" -బండి సంజయ్ ఫైర్!
హైదరాబాద్, జర్నలిస్టు సొసైటీలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు GHMC పరిధిలో ప్రభుత్వం కేటాయించిన భూమిపై రావు బీ చెలికాని అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, భూ కేటాయింపులను రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడిన సంజయ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లో...
* డబ్బులు చెల్లించి కొనుక్కున్నా ఇండ్ల స్థలాలు రాకుండా చేస్తారా?
* సుప్రీం తీర్పుకు ముమ్మాటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులే కారణం
* జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేస్తారా?
* మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాల్సిందే
* ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి జర్నలిస్టులను ఆదుకోవాల్సిందే.. లేనిపక్షంలో జర్నలిస్టులతో కలిసి ఉద్యమిస్తాం
* బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టిస్తాం
* జర్నలిస్టులారా, ఆందోళన చెందకండి... మీకు అండగా మేం ఉంటాం
* బీజేపీ అధికారంలోకి రాగానే జేఎన్జే సొసైటీ సహా అర్హులందరికీ ఇండ్ల స్థలాలిస్తాం

Post a Comment