KTPS 7వ దశ రీజినల్ అధ్యక్షులుగా దంచనాల
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H-58 (రికగ్నైజ్డ్) KTPS 7వ దశ రీజినల్ అధ్యక్షులుగా దంచనాల. TRVKS KTPS ప్రాంతీయ కార్యాలయంలో తోట కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన KTPS 7వ దశ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో TRVKS KTPS 7వ దశ రీజనల్ అధ్యక్షులుగా దంచనాల రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు. ఇట్టి సమావేశంలో రాష్ట్ర నాయకులు ,జెన్కో నాయకులు , KTPS 7 వ దశ రీజనల్ నాయకులు, KTPS 5&6 దశల రీజినల్ నాయకులు, BTPS రీజినల్ నాయకులు, YTPS రీజినల్ నాయకులు మరియు ఆర్టిజన్ నాయకులు పాల్గొని దంచనాల రాంబాబుకి అభినందనలు తెలిపినారు.
ఈ సందర్భంగా చారుగుండ్ల రమేష్ మాట్లాడుతూ కార్మికుల, ఉద్యోగుల మరియు ఆర్టిజన్స్ యొక్క ముఖ్య సమస్యల పరిష్కారం కొరకు ఐక్య ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏర్పడినదని ఈ దిశగా TRVKS సంఘం ప్రయత్నం చేస్తున్నదని తెలిపినారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రమేష్ ని సమావేశంలో పాల్గొన్న అందరు నాయకులు ఘనంగా సన్మానించినారు.
KTPS 7వ దశ రీజినల్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన దంచనాల రాంబాబు ఇటీవల నూతనముగా వైటిపిఎస్ రీజినల్ అధ్యక్ష,కార్యదర్శులు ఎన్నిక కాబడిన మల్లెల వీరనారాయణ, నాదెళ్ల రవికుమార్ జెన్కో అసిస్టెంట్ సెక్రటరీగా నియమింపబడిన మోతుకూరు ప్రేమ్ కుమార్ ని నాయకులు సన్మానించినారు.

Post a Comment