ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత ఉండోద్దు:మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా రవాణా శాఖకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలను సమకూర్చేలా చూడాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.
జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Post a Comment