కులగణన సర్వేకు ప్రజలు సహకరించండి నాగా సీతారాములు
సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. సుజాతనగర్ లో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో భాగంగా తమ ఇంటివద్ద కుటుంబ వివరాలు నమోదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి సర్వే చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే పట్ల సామాజిక మధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలేవరు నమ్మొద్దని అన్నారు.
విద్యావంతులు కూడ కొంతమంది సర్వేకు వ్యతిరేకంగా సామాజిక మధ్యమాల్లో మాట్లాడడం విచారకరమన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమన్యాయం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment