-->

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద్ మరియు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు విమల అన్నారు. శుక్రవారం సదాశివపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజేతలకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు విమల సిపిఐ నాయకులతో కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముత్యాల ముగ్గులు మరియు సంక్రాంతి పండగల ద్వారా మన సంప్రదాయాలను పునరుద్ధరించడంతో పాటు ప్రజల మధ్య ఆనందం పంచేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ముగ్గుల పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు షఫీ అహ్మద్, ముస్తాఫా, శంకరప్ప, సంజీవ్ రెడ్డి, రమేష్, బుజ్జమ్మ, అనుసూజా, బిపాషా, సాధిక్ అలీ, మేఘన, అలంకృత, హేమలత, నాగలక్ష్మి, మాధవి, హిందు, రాణి తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793