విద్యాశాఖ అధికారులను ఘనంగా సన్మానించిన సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాన్
జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా ఉమ్మడి పరీక్షలవిభాగం అధికారి గారిని సన్మానించిన సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాన్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి M వెంకటేశ్వరాచారి ని మరియు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం అధికారి S. మాధవరావు ని సొసైటీ కార్యాలయానికి ఆహ్వానించి, సింగరేణి విద్యాసంస్థల యందు చదువుతున్న విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను గురించి సొసైటీకార్యదర్శి గుండా శ్రీనివాస్ వారికి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ యొక్క సేవలను కొనియాడుతూ ప్రభుత్వం తరపున సింగరేణి విద్యాసంస్థలకు తమయొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అలాగే జిల్లా విద్యా శాఖకు అన్ని వేళలా సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క సహకారం అందిస్తామని సెక్రటరీ తెలియజేశారు.
సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయం నందు, సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ మరియు జాయింట్ సెక్రటరీ K. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి M. వెంకటేశ్వరాచారి ని మరియు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగ అధికారి S. మాధవరావు లను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు A. సాయి సుజాత మరియు సీనియర్ ఉపాధ్యాయుడు D. పూల్ సింగ్ మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment