ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు ఐదుగురు కూలీలు మృతి
సూర్యాపేట జిల్లా, రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగమంచు కారణంగా కనిపించక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు, రోడ్డుపై నిలిచిన ఇసుక లారీని వేగంగా ఢీకొట్టింది.
ప్రమాద వివరాలు:
ఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మరో 17 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తీసేందుకు భారీ క్రేన్ సహాయంతో చర్యలు చేపట్టారు.
పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment