-->

నేను కొడితే మామూలుగా ఉండదు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

 

నేను కొడితే మామూలుగా ఉండదు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, జహీరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మౌనంగా గమనిస్తున్నానని, అయితే అవసరమైతే తాను గట్టిగా ఎదురుదాడి చేస్తానని హెచ్చరించారు. "నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొట్టడం నాకు అలవాటు," అంటూ తన దృఢమైన వైఖరిని ప్రదర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన, "ప్రజలను ఎన్నిసార్లు హెచ్చరించినా, తులం బంగారం మాటలు నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు ప్రాజెక్టులు నిలిచిపోయాయి, అభివృద్ధి స్థంభించిపోయింది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"తెలంగాణ ప్రజల విజయమే మన విజయం. ఇక వెనుకడుగు లేదు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి!" అంటూ తన అనుచరులను చైతన్యపరిచారు.

రాష్ట్రంలో భూస్థిరాస్తి ధరలు క్షీణిస్తున్నాయని పేర్కొంటూ, "ఇదంతా ఎందుకు జరుగుతోంది?" అంటూ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సంధించారు. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని మండిపడ్డారు.

"టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ కాదు. ఇక మాటలు సరిపోవు, ప్రత్యక్ష పోరాటమే మార్గం" అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితబంధును విస్మరించిందని, "తులం బంగారం పథకం గోవిందా!" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనపై అహర్నిశలు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.