ఘోర రోడ్డు ప్రమాదం ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
- ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
సూర్యాపేట జిల్లా, హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో క్లీనర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడి, అతని పైనుంచి బస్సు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ప్రయాణికుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతులైన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు.

Post a Comment