-->

రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాపు సీతాలక్ష్మి

 

రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాపు సీతాలక్ష్మి

రైతు భరోసా పథకం అమలులో మోసం

రైతులకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, రూ. 12,000 మాత్రమే ఇస్తూ మోసం.

ఏడాది కాలంగా రైతులకు బాకీ పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్.

ఆరు గ్యారంటీలు నేటికీ అమలుకాని ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణ.

కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి హెచ్చరిక.

కొత్తగూడెం: బీఆర్ఎస్ హయాంలో రైతులను రాజుగా నిలిపితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతు భరోసా కింద రూ. 15,000 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 12,000 మాత్రమే ఇస్తూ మోసం చేసిందన్నారు.

రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే బాకీ మొత్తాన్ని చెల్లించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర పోరాటాలు చేయాలని హెచ్చరించారు.

రైతు బంధు పథకంపై విశ్వాసం

సీతాలక్ష్మి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే చెప్పినట్లుగా కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతు బంధు పథకం అమలు కానిదని, నేటి పరిస్థితి అందుకు నిదర్శనమని అన్నారు. రైతు బంధు పథకాన్ని పూర్తిగా నిలిపివేసి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793