తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
తెలంగాణ రాష్ట్రంలో తాజా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉంది.
పురుషుల సంఖ్య: 1,66,41,489
మహిళల సంఖ్య: 1,68,67,735
థర్డ్ జెండర్: 2,829
యువ ఓటర్లు:
18-19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఓటర్లు 5,45,026 మంది.
సీనియర్ ఓటర్లు:
85 సంవత్సరాలు లేదా దానికంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ ఓటర్లు 2,22,091 మంది.
ప్రత్యేక విభాగాలు:
NRI (ఓవర్సీస్) ఓటర్లు: 3,591
PWD (దివ్యాంగ) ఓటర్లు: 5,26,993
నియోజకవర్గాల వివరాలు:
అత్యధిక ఓటర్లు: శేరిలింగంపల్లి (7,65,982 మంది)
అత్యల్ప ఓటర్లు: భద్రాచలం (1,54,134 మంది)
ఈ వివరాలను ప్రకటన చేస్తూ, ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

Post a Comment