-->

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భూకంపం నమోదు

 

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భూకంపం నమోదు

నేపాల్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భూకంప కేంద్రం నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుకు సమీపంలో, లబుచేకు 93 కి.మీ దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా పడింది.

దిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు సమాచారం. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్‌ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

భూకంపం తీవ్రత 6 నుంచి 7 మధ్య ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అందలేదు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793