పలు రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి సీఎం రేవంత్
పలు రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి
దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రెవ్వంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రైల్వే ప్రాజెక్టులను విర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా, చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను వివరించి, వీటి అమలుకు కేంద్ర సహకారం అవసరమని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలు:
1. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
గతంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని కోరారు.
2. డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే మరియు రైల్వే లైన్
హైదరాబాద్ నుండి బందర్ పోర్టు వరకు ప్రత్యేక హైవే, రైల్వే లైన్ నిర్మాణం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి ఊతం కల్పించాలన్నారు.
3. ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమల ప్రాధాన్యత
తెలంగాణ ఫార్మా ఉత్పత్తుల్లో దేశంలో ముందంజలో ఉంది. ప్రత్యేక రవాణా సదుపాయాలు అయితే రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.
4. మెట్రో రైలు ఫేజ్-2
దేశంలో రెండో స్థానం దక్కించుకున్న తెలంగాణ మెట్రో రైలు అభివృద్ధి, గడచిన దశాబ్దంలో మందగమనం చెందిందని పేర్కొన్నారు. ఫేజ్-2ను కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
5. వికారాబాద్-కర్నాటక కనెక్టివిటీ
వికారాబాద్ నుండి కృష్ణా వరకు అనుసంధానం చేసే రైల్వే లైన్ ప్రాజెక్టు అమలు చేయాలని కోరారు.
అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్
హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇది పూర్తి అయితే నగరానికి మరింత వృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని చెప్పారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు పూర్తి కావడం పట్ల ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Post a Comment