చైనాలోని హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో ప్రవేశం!
బెంగళూరులో 8 నెలల శిశువుకు పాజిటివ్ నిర్ధారణ
కరోనా మహమ్మారితో ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోకముందే, చైనాలో కొత్త వైరస్‌లు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్‌లో అడుగుపెట్టినట్లు ధృవీకరించబడింది.
కర్ణాటకలోని బెంగళూరులో 8 నెలల శిశువు ఈ వైరస్ బారిన పడింది. బాప్టిస్ట్ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదికలో ఈ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
హెచ్‌ఎంపీవీ లక్షణాలు:
ఈ వైరస్ వల్ల కరోనా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా:
దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది.
చైనాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం అధికారికంగా ఈ పరిస్థితిని ధృవీకరించలేదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
భారత్‌లో అలర్ట్:
హెచ్‌ఎంపీవీ ఇండియాలోకి అడుగుపెట్టిందని తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు కేసు తరువాత, ఇతర ప్రాంతాల్లోనూ ఈ వైరస్‌పై గట్టి నిఘా పెట్టింది.
ప్రస్తుతానికి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment