మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం తప్పిన పెను ప్రమాదం
తిరుమలాయపాలెం వద్ద శనివారం రాత్రి ఒక అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కారు వరంగల్ నుండి ఖమ్మం వెళ్తుండగా రాత్రి 8:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.
కారులో ఉన్నప్పుడు ఒకేసారి రెండు టైర్లు పేలిపోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. అయితే, డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య కూడా ప్రయాణిస్తున్నారు.
ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ప్రమాదం కొద్దిసేపు ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ డ్రైవర్ యొక్క స్పందనకు అభినందనలు తెలిపారు.

Post a Comment