సింగరేణి ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసంలో ప్రత్యేక సౌకర్యం కోసం విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సౌకర్యం కల్పించాలని సింగరేణి మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థించింది.
ఈ క్రమంలో, ముస్లిం ఉద్యోగులకు డ్యూటీ సమయానికి ఒక గంట ముందు రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు జీఎం (పర్సనల్) కావిత నాయుడు కి మెమొరాండం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై జీఎం సానుకూలంగా స్పందిస్తూ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రజాక్, జనరల్ సెక్రటరీ ఆసిఫ్, బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సవీర్, ఖాసీం, జానీ, సిబాహతుల్లా, హైదర్, గౌస్, అతహర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నిర్ణయం అమలవడం ద్వారా రంజాన్ ఉపవాసం పాటిస్తున్న ముస్లిం ఉద్యోగులకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో మరింత సౌలభ్యం కలుగనుంది.

Post a Comment