-->

రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్


హైదరాబాద్, తెలంగాణలో మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఇది. రంగుల పండుగ హోలీ సందర్భంగా, మద్యం విక్రయాన్ని నియంత్రించేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (మార్చి 14) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని పోలీస్‌ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారుల ప్రకారం, హోలీ రోజున ఉల్లాసంగా వేడుకలు జరుపుకోవడంలో అశ్రద్ధ చేయకూడదని, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇక, హోలీ రోజున మద్యం దుకాణాల మాత్రమే కాకుండా, బీఫ్‌ దుకాణాలను కూడా మూసివేయాలని సంబంధిత అధికారులను బల్దియా అధికారులు ఆదేశించారు. హోలీ వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793