-->

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టు పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ సీజ్

 

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టు పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ సీజ్

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి బుధవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ (సివిల్ డ్రస్) పోలీసులచే అరెస్టు చేశారు. పోలీసులు రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సీజ్ చేశారు.

ఈ అరెస్టుకు కారణంగా, రేవతి తన యూట్యూబ్ ఛానల్‌లో రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేయడమే అని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టు తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ చర్యను ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటిపై దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం అని ఆయన విమర్శించారు. అదనంగా, యువ జర్నలిస్టు తన్వీ యాదవ్‌ను కూడా అరెస్టు చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను ఒక రైతు వివరించగా, ఆ వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793