తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్: 22 మంది మావోయిస్టులు హతం
ఉసూర్ ప్రాంతంలో భారీ combing ఆపరేషన్ కొనసాగుతోన్న భద్రతా బలగాలు
బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండల్లో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ "కగార్" ను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యూనిట్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
హిద్మా లక్ష్యంగా భారీ combing
ఈ ప్రత్యేక ఆపరేషన్ ఉద్దేశ్యం — దేశవ్యాప్తంగా గట్టిగా నిఘా వేసిన అగ్రశ్రేణి మావోయిస్టు నేతలను, ముఖ్యంగా హిద్మాను పట్టుకోవడమే. భద్రతా వర్గాల సమాచారం మేరకు, ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంఖ్య ఎక్కువగా ఉందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా చర్యలు ముమ్మరం చేశారు.
ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి
ఈరోజు ఉదయం కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు భద్రతా బలగాల చేతికి చిక్కాయి. ఒక మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు 303 రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అధికారిక ధృవీకరణ
ఈ ఎన్‌కౌంటర్‌ను సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ అధికారికంగా ధృవీకరించారు. భద్రతా బలగాలు ప్రస్తుతం కర్రెగుట్ట ప్రాంతంలోని కీలక గుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి.
ఫార్వర్డ్ బేస్ క్యాంపుల ఏర్పాటు
ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఇప్పటికే ఏర్పాటు కాగా, అలుబాక శివారులో మరో క్యాంపు ఏర్పాటులో ఉంది. ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్ల సహాయంతో మావోయిస్టుల కదలికలపై నిఘా కొనసాగుతోంది.
భూగర్భ బంకర్ల వేట
K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల వేటను కొనసాగిస్తున్నాయి. శత్రు బలగాలు స్థాపించిన బంకర్లకు సంబంధించిన సమాచారం మేరకు ప్రతి అంగుళం నేలపైన, నేలక్రింద క్షుణ్నంగా గాలిస్తున్నారు. మందుపాతరలు, IED బాంబులు వంటి ప్రమాదకర పరికరాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Post a Comment