ఎస్సీ కులాలకు రాజ్యాంగ హక్కులు అమలు చేయాలి
కరకగూడెం తహసిల్దార్‌కు వినతి పత్రం
పోరాట సమితి సభ్యులు, ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైన హక్కులు పూర్తిగా అమలవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, నిరుపేద ఎస్సీ కుటుంబాలకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, "ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సమానంగా జరగాలి. ఎస్సీ రైతులకు భూభారతి చట్టం ద్వారా హక్కుపత్రాలు ఇవ్వాలి. సాగు భూములు, పోడు భూములపై హక్కులను కాపాడాలి," అని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అమలుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణాల వంటి ప్రభుత్వ పథకాలను హక్కుదారులకు చేరవేయాలని కోరారు.
ఈ ధర్నాలో పాల్గొన్న ప్రముఖులు: ఇనుముల వెంకటేశ్వర్లు (రాష్ట్ర నాయకుడు), నరాల రాజేష్, కుమ్మరి సమ్మయ్య, బోడ నాగేశ్వరరావు, కీసరి దుర్గయ్య, గోగు సమ్మయ్య, సల్లూరు ముత్తయ్య, గిద్ద చిన్న రాములు, కీసరి ఎల్లమ్మ, జాడి తిరుపతమ్మ, సమ్మక్క, గోపి సమ్మక్క, దొడ్డి సావిత్రి, గిద్ద చిన్న వెంకన్న, కండే నరసింహారావు, కొండకర్ల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Post a Comment