-->

మరో వారం వర్షాలే..! తెలంగాణకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ

మరో వారం వర్షాలే..! తెలంగాణకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ


హైదరాబాద్, : తెలంగాణ రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 12వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బుధవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల.

ఎల్లో అలర్ట్‌ కింద ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి.

వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడురోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు సూచించారు.


Blogger ఆధారితం.