తూప్రాన్‌లో క్రికెట్ ప్రైమర్ లీగ్ పోటీలు ఘనంగా నిర్వహణ
మెదక్, తూప్రాన్ మండలంలో క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆదివారం రోజున టీపీఎన్ క్రికెట్ ప్రైమర్ లీగ్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తూప్రాన్ పట్టణంలోని మైనారిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో తూప్రాన్ మండలానికి చెందిన ఆరు జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
పోటీలో అన్ని జట్లు హోరాహోరీగా తలపడగా, తూప్రాన్ తండర్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. రన్నరప్ గా షోయేబ్ జట్టు నిలిచింది. విజేత తండర్ జట్టుకు క్రికెట్ ట్రోఫీతో పాటు రూ.5,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.1,000 నగదు బహుమతి అందజేశారు.
ఈ పోటీకి స్పాన్సర్‌లుగా ఎండీ ఉమర్, ఎండీ సమీర్, ఎండీ అజర్ (బబ్లు) తమదైన సహాయ సహకారాలు అందించారు. మెయింటెనెన్స్ ఆర్గనైజర్‌గా ఎండీ సజీద్ బాధ్యతలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం క్రికెట్ ప్రేమికుల మద్దతుతో ఉత్సాహభరితంగా సాగింది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
Post a Comment