జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: కాపు కృష్ణ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్‌కాస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అతనితోపాటు జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు – టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఈశ్వర్, ఫిట్ సెక్రటరీ పిచ్చయ్య, జి.ఎస్ శ్రీనివాస్, ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీలు చంద్రశేఖర్, తిరుపతి, అశోక్, పి.పి.రాజు, సాగర్, కాజా భక్ష, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విజయవంతం కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని, కార్మికుల్లో చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. కార్మిక సంఘాల ఐక్యతే ఈ పోరాటంలో విజయం తెచ్చిపెడుతుందని నేతలు స్పష్టం చేశారు.
Post a Comment