-->

హైదరాబాద్‌లో 8 మంది ఫేక్ డాక్టర్లు గుర్తింపు – టీజీఎంసీ దాడులు

హైదరాబాద్‌లో 8 మంది ఫేక్ డాక్టర్లు గుర్తింపు – టీజీఎంసీ దాడులు


హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) అధికారులు గట్టిగా అలర్ట్ అయ్యారు. ఈ మేరకు బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 8 మంది అర్హత లేని వైద్యులను గుర్తించారు. వారు రోగులకు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ లాంటి శక్తివంతమైన మందులను విచక్షణ లేకుండా ఇస్తూ, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నారని TGMC తెలిపింది.

దాడులు నిర్వహించిన క్లినిక్లు:

  1. ఆరెంజ్ క్లినిక్ (SK. నాగులమీరా)
  2. బీఎల్ఆర్ క్లినిక్ (డా. పి. సూర్యలత)
  3. నాని మినీ హాస్పిటల్ (కె. వెంకటేశ్)
  4. శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (వై. సూర్యనారాయణ)
  5. శ్రీ శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శివ శంకర్)
  6. బాలాజీ క్లినిక్ (చి. విట్టల్)
  7. నందుశ్వర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శంకర్ గౌడ్)
  8. మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (SK. మస్తాన్)

ఈ దాడులను TGMC వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ మరియు సభ్యుడు డా. విష్ణు ఆధ్వర్యంలో బృందాలు నిర్వహించాయి. నిందితులపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:

ఎవైనా నకిలీ డాక్టర్లు పనిచేస్తున్నారని సమాచారం ఉంటే, వెంటనే వాట్సాప్ నంబర్ 91543 82727 కు సమాచారం పంపించాలని TGMC విజ్ఞప్తి చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.