మినార్పల్లిలో ఘోర హత్య: భర్తను కత్తితో పొడిచిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మినార్పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై జీవితాన్ని దెబ్బతీస్తున్న భర్తను ఓ భార్య హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… మినార్పల్లి గ్రామానికి చెందిన దేశ్యనాయక్ (57) అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యపానానికి బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ కుటుంబానికి భారంగా మారాడు. భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఎంతమాత్రం చెప్పినా మారకపోవడంతో భార్య మనస్తాపానికి గురైంది.
శుక్రవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన భార్య, తన భర్త దేశ్యనాయక్‌పై కత్తితో దాడికి దిగింది. గొంతులో తీవ్రంగా గాయాలు రావడంతో గంభీరంగా రక్తస్రావమయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ దేశ్యనాయక్ మరణించాడు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలను వెలికితీయడానికి విచారణ చేపట్టారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన మరోసారి బయటపెట్టింది.
Post a Comment