-->

నారాయణఖేడ్ కట్టమైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవం

నారాయణఖేడ్ కట్టమైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవం


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రసిద్ధ కట్టమైసమ్మ దేవాలయంలో అసాడమాసం బోనాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ నిర్వాహకులు ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవం, పట్టణవ్యాప్తంగా భక్తి సంద్రంగా మారింది.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు, యువతులు సంప్రదాయ వేషధారణలో బోనాలతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజే సౌండ్స్‌తో నృత్యాలు, గీతాలాపనలు, సాంప్రదాయ కళలతో ఊరేగింపు నారాయణఖేడ్ ప్రధాన వీధులలో కళకళలాడింది.

భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో దేవాలయం చుట్టుపక్కల పుణ్యక్షేత్ర వాతావరణం ఏర్పడింది.

ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు ప్రభాకర్, దశరథ్ మాట్లాడుతూ, "ప్రతి ఏడాది కట్టమైసమ్మ గుడిలో అసాడమాసం బోనాలు నిర్వహించడం ఓ ఆనవాయితీ. ఈ ఏడాది కూడా భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహించాం" అని చెప్పారు.

భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మిళితంగా సాగిన ఈ ఉత్సవం స్థానికులకే కాదు, పరిసర ప్రాంతాల భక్తులను కూడా ఆకట్టుకుంది.

Blogger ఆధారితం.