-->

TEE 1104 యూనియన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు విజయవంతం

 

TEE 1104 యూనియన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు విజయవంతం

హైదరాబాద్, TEE 1104 యూనియన్ 5వ జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశం హైదరాబాదులోని కొత్తపేటలో ఉన్న రాజధాని గార్డెన్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి యూనియన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలకు NPDCL, SPDCL, TRANSCO, GENCO నాలుగు విద్యుత్ సంస్థల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు డెలిగేట్లుగా హాజరయ్యారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోస్టులకి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల ఫలితంగా క్రింది నాయకులు ఎన్నికయ్యారు:

  • రాష్ట్ర అధ్యక్షుడు:  వేమునూరు వెంకటేశ్వర్లు
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి:  సాయిబాబా
  • రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు: కంటే రాజేందర్
  • రాష్ట్ర అదనపు కార్యదర్శి:  వరప్రసాద్

ఈ ఎన్నికలను ఎన్నికల అధికారి ఆర్. జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన రాష్ట్ర నాయకత్వం, ఆయన్ని యూనియన్ రాష్ట్ర సలహాదారుగా ఏకగ్రీవంగా నియమించింది.

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన నాయకులు, డెలిగేట్లు నూతన నాయకత్వాన్ని అభినందించారు. సంఘీభావం, ఐక్యతతో యూనియన్ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జెన్కో అధ్యక్షులు కేశబోయిన కోటేశ్వరరావు, కుశలవ రెడ్డి, సత్యం, రవీందర్ రెడ్డి, బిచ్చ, గోపి, రాము గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.